ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన న్యాయకోవిదులు శ్రీ తాళ్ళూరి సునీల్ చౌదరిగారు రాష్ట్ర హై కోర్ట్ అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.గతంలో హైకోర్ట్ పరిపాలనా, విజిలెన్స్ రిజిస్త్రార్ గా పనిచేసిన సునీల్ గారు రాష్ట్ర హై కోర్ట్ రిజిస్త్రార్ జనరల్ గా కూడా వ్యవహరిచారు. న్యాయ శాస్త్రంలో విశేష అనుభవమున్న సునీల్ గారు గతంలో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ప్రిన్సిపాల్ జడ్జి గా సేనలందించారు. 1998లో నేరుగా జిల్లా జడ్జి గా నియమితులయ్యారు. హై కోర్ట్ లో గవర్నమెంట్ ప్లీడర్ గా కూడా పనిచేసిన అనుభవం ఆయనిది. 24.10.2013 తేదీన హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాన్ జ్యోతి సేన్ గుప్తా, అదనపు న్యాయమూర్తిగా శ్రీ సునీల్ గారిచేత ప్రమాణం చేయించారు. వీరికి భార్య, ఇద్దరు కుమార్తెలు వున్నారు. పెద్ద అమ్మాయి CA చదువుతుండగా , చిన్న అమ్మాయి B.Tech చదువుతున్నారు. సునీల్ గారి సతీమణి శ్రీమతి శైలజ కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వీరి చేరికతో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో కమ్మ జడ్జిల సంఖ్య మూడుకు చేరింది.
↧