Quantcast
Channel: Kammas World
Viewing all articles
Browse latest Browse all 736

తెలంగాణా ముఖ్యమంత్రి KCR కు బాకా ఊదుతున్న ఆంధ్ర చానళ్లను బహిష్కరించండి

$
0
0
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశానుసారం TV9, ABN ఆంధ్ర జ్యోతి చానళ్లను 'తెలంగాణా'ప్రాంతంలో MSO లు బహిష్కరించి, ప్రసారాలను నిలిపి వేశారు. ఈ చర్యను ప్రజాస్వామికవాదులు అందరు ఖండించారు కాని కొన్ని ఆంధ్ర ప్రాంతం వారి యాజమాన్యంలో నడపబడుతున్న చానళ్ళు మాత్రం ఖండించలేదు సరి కదా! తమ TRP రేటింగ్ పెరుగుతుందని సంబరాలు చేసుకున్నాయి. 

ఈ చానళ్ళ యాజమాన్యాలు హైదరాబాద్ లోనే తమ కార్యాలయాలు, స్టూడియోలు  కలిగి ఉండి, తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రాంతం వారి వార్తల పట్ల చిన్న చూపు చూస్తూ, వారికీ సంబంధించిన వార్తలకు, అధమ ప్రాధాన్యతనిచ్చి, తెలంగాణా వార్తలకు, KCR, TRS వార్తలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని చిన్నబుచ్చుతున్నారు. ఈ విషయంలో ETV కొంతలో కొంత నయం, తెలంగాణాకు, ఆంధ్ర ప్రాంతానికి వేర్వేరు చానళ్లను ఏర్పాటు చేసింది.  

వీరి చానళ్ళకు వీక్షకులు (viewers) ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతం వారే! వీరి చానళ్ళకు రేటింగులు, ప్రకటనలు, ప్రకటనల ఆదాయం వచ్చేది ఆంధ్ర ప్రాంతం వారి నుంచే! కాని వీరు ఆంధ్ర ప్రాంతం లో తమ కార్యాలయాలు పెట్టకుండా హైదరాబాద్ నుండే కార్యకలాపాలు సాగిస్తూ, ఆంధ్ర ప్రజలను అడ్డం పెట్టుకుని ఆదాయం పొందుతూ, తెలంగాణాకు బాకాలు ఊదుతూ, ఆ ప్రభుత్వానికే పన్నులు కడుతూ ఆంధ్ర ప్రాంతానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. 

ముఖ్యంగా NTV, TV5, CVR News, StudioN, INews చానళ్ళు కెసిఆర్ కు బాకాలు ఊదటంలో పోటీలు పడుతున్నాయి. ఈ చానళ్ళ తీరు మార్చుకొనేవరకు, ఆంధ్ర ప్రాంతంలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకొనే వరకు, అదేవిధంగా ETV, MAA TV, Gemini TV, MAHAA TV, ABN, TV9, 6TV, సాక్షి చానళ్ళు కూడా ఆంధ్ర ప్రాంతం లోనే కార్యాలయాలు ఏర్పాటు చేసుకొనే విధంగా ఆంధ్ర ప్రజలు, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన పక్షంలో తద్వారా ఆంధ్ర ప్రాంతం లో వారికి ఉద్యోగం, ఉపాధి, ఈ చానళ్ళకు వందల కొట్లలో వచ్చే ప్రకటనల ఆదాయంలో పన్నుల రూపేణా ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. Express TV విజయవాడ నుండి, Y TV వైజాగ్ నుండి టెలికాస్ట్ అవుతున్నాయి, వీటిని చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి.

కాబట్టి ఈ చానళ్ళ వారు ఇప్పటికైనా తమ పంధా మార్చుకుని తమ ప్రాంతానికి అన్యాయం జరుగకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని, లేని పక్షంలో ఆంధ్ర ప్రాంతంలో MSO లు, ప్రజలే స్వచ్చందంగా ఈ చానళ్లను బహిష్కరించాలని కోరుకుందాం. 

Viewing all articles
Browse latest Browse all 736

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>